యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.

వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్  ఆకిటి శంకర్  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .జనవరి 15. (లోకల్ గైడ్).


  కట్టంగూర్ మండలం యరసానిగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని చిన్మయి హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్యులు డా. చెవుల శ్వేత ఆధ్వర్యంలో ఉచిత చెవి, ముక్కు, గొంతు వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు . ఈ వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్  ఆకిటి శంకర్  ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్  ఆకిటి శంకర్  మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం చాలా అవసరమన్నరు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు సంబంధిత సమస్యలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్మయి హాస్పిటల్ వైద్య బృందానికి, డాక్టర్ శ్వేతకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు, గ్రామపంచాయితీ సిబ్బందికి, విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించారు.  చెవి, ముక్కు, గొంతు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింత యాదగిరి, ఉపాధ్యాయులు గాలి సంధ్యారాణి, తరాల పరమేశ్ యాదవ్, వార్డు సభ్యులు నామా సైదులు, గ్రామ పెద్దలు పులకరం నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య, సుధాకర్, నాగార్జున, ఆశా వర్కర్ ధనలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
సిద్ధిపేట జిల్లా ప్రతినిధి మార్చి15(లోకల్ గైడ్ తెలంగాణ)  ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని మైత్రి వనంలో గల వెనుకబడిన అభివృద్ధి శాఖ మరియు షెడ్యూల్ కులాల అభివృద్ధి...
సింగరేణి మండలం సర్పంచ్ లా ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం 
శిక్షణ ను సద్వినియోగం చేసుకొని జనగణన పకడ్బందీగా
మెట్ల దారిన.. మొక్కుల దేవుని చెంతకు! శ్రీనివాసగిరిపై భక్తి పారవశ్యం.. భక్తులతో కలిసి నడిచిన మంత్రి పొంగులేటి
యరసానిగూడెం గ్రామంలో ఉచిత చెవి–ముక్కు–గొంతు వైద్య శిబిరం.
ఘనంగా గంగమ్మ ఆలయ తృతీయ వార్షికోత్సవం.
చలివేంద్రం ప్రారంభించిన సారపాక సర్పంచ్ ఉపసర్పంచ్