మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 

2027 మార్చి వరకు కొనసాగ నున్న గణన ప్రక్రియ

మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 

మహబూబ్ నగర్ మార్చ్ 17 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)

అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు,ప్రణాళిక ల రూపకల్పన లో జనాభా గణన ఉపయోగ పడుతుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు 
 మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం  సమావేశ మందిరంలో చార్జి అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ  ముగింపు కార్యక్రమం లో జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న  తొలి జనగణన అని, 2011 జనాభా గణన తర్వాత   
2021 లో నిర్వహించ వలసిన  ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యంగా జనాభా గణన 2027 లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గత కొన్ని సంవత్సరాలలో జనాభా పరంగా,పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని, తెలిపారు.
జన గణన కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల జాబితా (హౌస్‌లిస్టింగ్,హౌస్ ఎన్యూమరేషన్), గృహాల గణన, తెలంగాణ రాష్ట్రంలో ఈ దశ మే 11, 2026న ప్రారంభమై జూన్ 9, 2026 వరకు కొనసాగుతుందని, రెండవ దశలో జన గణన (పాపులేషన్ ఎన్యుమరేషన్) ప్రక్రియ ఫిబ్రవరి 2027లో నిర్వహించబడుతుందని, మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణిస్తారని అన్నారు.
ఈ సంవత్సరం జరగనున్న జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని, మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు  తెలిపారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అంటే ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
మొదటి దశలో నిర్వహించబడే ఇళ్ల జాబితా మరియు గృహాల గణనలో ఇంటి నిర్మాణం (కచ్చా పక్కా,తదితర,) ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, త్రాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్ , కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు.
జనాభా లెక్కలు సేకరించడం ఒక ముఖ్యమైన బాధ్యతతో పాటు సవాలుతో కూడుకున్న పని అని ఆమె పేర్కొన్నారు. అందుకు అధికారులు శిక్షణ లో తెలియచేసే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకోవాలని,ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు
ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని తప్పకుండా గణనలో చేర్చాలని అధికారులకు ఆమె ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి ఉపాధి కోసం వచ్చిన వలస కూలీలను కూడా గణనలో చేర్చి వారి వివరాలను నమోదు చేయాలని సూచించారు.
 ఫీల్డ్ స్థాయిలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ముందస్తుగా సిద్ధంగా ఉండాలని, పైస్థాయి అధికారులతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తూ సమస్యలను పరిష్కరించుకుని జనగణనను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
    డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ కార్యాలయం ఏ .డి.అర్థ నారీశ్వర సామి
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
 రెవెన్యూ గ్రామాలను, పట్టణాల్లోని వార్డులను సి.ఎం.ఎం.ఎస్ పోర్టల్ ద్వారా  హౌస్ లిస్టింగ్, ఎన్యూమరేషన్ చేయడం ,స్వయంగా చేయడం శిక్షణ లో వివరించారు
జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ మాట్లాడుతూ అన్ని
 శాఖల అధికారులు సమన్వయంతో జన గణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు
   ఈ కార్యక్రమంలో  జడ్.పి. సి.ఇ.ఓ,ఇంచార్జి డి.పి.ఓ వెంకట రెడ్డి, జిల్లా ముఖ్య   ప్రణాళిక అధికారి రవీందర్,జిల్లా విద్యా శాఖ అధికారి ప్రవీణ్ కుమార్,
జిల్లా మాస్టర్ ట్రైనర్ బాలు యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.