సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు

సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి

దుమ్ముగూడెం : లోకల్ గైడ్ :
దుమ్ముగూడెం మండలం పర్ణశాల రైతు వేదికలో మంగళవారం సహజ వ్యవసాయం పై ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు ప్రారంభించి రైతులకు మార్గదర్శకత్వం అందించారు.
శిక్షణలో భాగంగా సహజ వ్యవసాయం పద్ధతులు, వాటి ప్రాముఖ్యత, ఖర్చు తగ్గింపు విధానాలు, నేల ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలపై అధికారులు రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు తగ్గించి సహజ వనరులను వినియోగించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న రైతులకు అవసరమైన వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. రైతులు సహజ వ్యవసాయాన్ని ఆచరణలో పెట్టి స్థిరమైన వ్యవసాయ విధానాల వైపు ముందడుగు వేయాలని బాబురావు సూచించారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.