వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం

గ్రామాభివృద్ధి, పరిపాలనపై సమగ్ర అవగాహన

వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం



మిడ్జిల్, మార్చి 17:(లోకల్ గైడ్ ):

మహబూనగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ వార్డు మెంబర్లకు నిర్వహించిన రెండో విడత శిక్షణ తరగతులు సోమవారం విజయవంతంగా ముగిశాయి.
ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి, పరిపాలన విధానాలు, ప్రజాసేవలో సభ్యుల బాధ్యతలు వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. అధికారులు పాల్గొని వార్డు మెంబర్లకు కార్యాచరణలో పాటించాల్సిన మార్గదర్శకాలను వివరించారు.
శిక్షణ ద్వారా సభ్యులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన పొందినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంఫియో రాజశేఖర్ రెడ్డి శిక్షణ పొందిన సభ్యులకు సర్టిఫికేట్లు అందజేశారు. చివరి రోజు శిక్షణను పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ నిర్వహించారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.