ఓట్ల లెక్కింపు పారదర్శకంగా చేపట్టాలి
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..
నారాయణపేట ఫిబ్రవరి 12:
మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత జాగ్రత్తగా, పారిదర్శకంగా చేపట్టాలని లెక్కింపు సమయంలో ఎలాం టి పొరపాట్లకు తావు లేకుం డా ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశిం చారు. గురువారం ఆమె జిల్లాలోని కోస్గి పట్టణంలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించారు. బుధవారం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లు ఏ సమయానికి వచ్చాయని, ఎప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పర్చారని, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షం లోనే భద్ర పరచారు కదా అని అడిగి తెలుసుకున్నారు. అందరి సమక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారమే బ్యాలె ట్ బాక్సులను స్ట్రాంగ్ రూం లో భద్రపరిచినట్లు మున్సిప ల్ కమిషనర్ నాగరాజు కలె క్టర్ కు తెలిపారు. ఆ తర్వాత
కళాశాలలోనే మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ, విధి విధానాలపై ఆర్వోలు, ఏ ఆర్వోలు, కౌంటింగ్ సూపర్ వైజర్లు అసిస్టెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. కౌటింగ్ అధి కారులకు పలు కీలక సూచ నలు చేశారు. కలెక్టర్ మాట్లా డుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆధ్యాం తం పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిం చాలని సూచించారు. ఓట్లను లెక్కించే సమయంలో పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లకు స్పష్టంగా చూపించి, చెల్లు బాటు అయ్యే ఓట్లను, చెల్లు బాటు కానీ ఓట్లను చాలా జాగ్రత్తగాపరిశీలించాలన్నారు. రిటర్నింగ్ అధికారి ఒకసారి ఏదైనా ఓటును ఇన్ వ్యాలు డ్ గా పరిగణించి నిర్ధారిస్తే .. మళ్ళీ ఆ ఓటును పరిగణ లోకి తీసుకోకూడదని చెప్పా రు. అభ్యర్థులు ఏదైనా కారణాలతో లిఖితపూర్వ కమైన నోటీసు ఇస్తేనే రీ కౌంటింగ్ పై నిర్ణయం తీసుకో వాలని దీనిపై తుది నిర్ణయం రిటర్నింగ్ అధికారి దేనని ఆమె తేల్చి చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో వార్డుల వారీగా అభ్యర్థి తరపున ఒక ఏజెంటు కు మాత్రమే అను మతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయ వంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం ఆమె కౌంటింగ్ హాల్ లో టేబుళ్ళ వారీగా
రిటర్నింగ్ అధికారి సమక్షంలో శుక్రవారం నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ రిహార్సల్స్ చేయించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు అధి కారులందరూ రిపోర్ట్ చేయా లని, 7 గంటలకు పార్టీల ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేసి సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ల ఓట్ల లెక్కింపు ప్రారంభించా లన్నారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్ ఎన్నికల స్పెషల్ అధికారి, డిఆర్డిఓ మొగులప్ప, తహసిల్దార్ బక్క శ్రీనివాస్, మున్సిపల్ మేనే జర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం మద్దూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టే జూనియర్ కళాశాల (రేనివట్ల రోడ్) లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఇక్కడా మొత్తం 8 టేబుల్ లకు గాను ఒక గదిలో 6 మరో గదిలో రెండు టేబుళ్ళ ను ఏర్పాటు చేయగా అన్ని ఒకే గదిలో ఏర్పాటు చేయాల్సి ఉండేదని కలెక్టర్ అన్నారు. అయితే కళాశాలలో అంత పెద్ద గది లేదని, అందుకే రెండు గదుల్లో ఏర్పాటు చేసినట్లు స్పెషల్ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. రెండు గదుల్లో ఏర్పాటు చేసిన 8 టేబుల్స్ ను, ఒక్కో టేబుల్ పై రెండేసి రౌండ్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టేందుకు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. పక్కనే ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాలలో ఎవ్వరికి సెల్ ఫోన్ అనుమతి లేదని కేంద్రం బయటే సెల్ ఫోన్లను డిపాజిట్ చేసి కేంద్రాల్లోకి అనుమతించాలని ఈ సందర్భంగా కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు దూర ప్రాంతం నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి స్థానికంగానే రాత్రి బస ఏర్పాట్లు చేయించాలని, కోస్గి లో దూర ప్రాంతాలకు చెందిన అధికారులకు అక్కడే రాత్రి బస ఏర్పాట్లు చేస్తున్నారని, మద్దూరు లోనూ అదే విధంగా ఏర్పాటు చేయాలనీ ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూరు మున్సిపాల్టీ కమిషనర్ శ్రీకాంత్, మున్సిపల్ మేనేజర్, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4కౌంటింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
----------------------------------------
