దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు లక్ష్మీపురం స్కూల్ పనుల్లో వేగం పెంచండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం
By Ram Reddy
On
బోనకల్లు/ లక్ష్మీపురం:లోకల్ గైడ్ :
విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. విద్య కోసం పెట్టే ప్రతి రూపాయి భవిష్యత్ తరాలను నిర్మించడం కోసం పెట్టే పెట్టుబడిగా ఆయన అభివర్ణించారు. ఆదివారం మధిర నియోజకవర్గం లో పర్యటించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామంలో నిర్మాణం అవుతున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.
నిర్మాణ దశలో ఉన్న భవన సముదాయాలను కలియతిరుగుతూ ఆయన పరిశీలన చేశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను, గుత్తేదారులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఈ సందర్భంగా జూనియర్ హాస్టల్, జూనియర్, సీనియర్, అడ్మినిస్ట్రేటివ్ భవనాల నిర్మాణాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి విక్రమార్క. అంతేకాకుండా మెకానికల్, సైన్స్, మ్యాథమెటిక్స్ , కంప్యూటర్ ల్యాబ్ భవనాల నిర్మాణాలను పరిశీలన చేశారు.
నాణ్యతలో ఎక్కడా రాజీ పడవద్దు అని ఆయన చెప్పారు. ఇవి కేవలం భవనాలు కాదు రేపటి తరాలను ఉజ్వలంగా నిర్మించే దార్శనిక దేవాలయాలుగా ఆయన అభివర్ణించారు.
Tags:
About The Author
Latest News
02 Apr 2026 19:45:14
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా
కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
