నారాయణపేట ఫిబ్రవరి 16:
నారాయణపేట మున్సిపాలిటీని అందరి సమిష్టి కృషితో గెలిపించుకున్నామని అదే స్పూర్తితో అభివృద్ధికి కృషి చేస్తామని పాలమూరు ఎంపీ.డి కే అరుణ అన్నారు.సోమవారం నారాయణపేట మున్సిపాలిటీ చైర్మెన్ , వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిసియో సభ్యులుగా హాజరు అయ్యారు.చైర్మెన్, వైస్ చైర్మన్ ఎన్నికలో తన ఓటు వేసి బిజెపి అభ్యర్థులను గెలిపించుకున్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో బిజెపి నాయకత్వం మొత్తం సమిష్టిగా పని చేసి పట్టు సాధించామనివన్నారు. ఒక అభ్యర్థి రెబల్ గా పోటీ చేసి విజయం సాధించిన పార్టీకి కట్టుబడి బీజేపీలో చేరారని తెలిపారు.అది క్రమశిక్షణ గల బీజేపీకే సాధ్యమని అన్నారు.ఎందరో ఎన్నో సమీకారణాలు చేశారని మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంటామని చెప్పుకున్నారని అన్నారు.కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు అని అన్నారు.కానీ నారాయణపేట మున్సిపాలిటీలో కమలం వికసించిందన్నారు.ప్రజల ఆకాంక్ష మేరకు పాలన అందిస్తామని స్పష్టం చేశారు.పట్టణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా నిధులు తీసుకువస్తామని అభివృద్ధి సాధిస్తామని అన్నారు.గెలుపొందిన పాలకులు సేవకులుగా పని చేస్తారని అన్నారు.
ఫోటో రైట్ అప్:4.విలేకరులతోమల్తాడుతున్న ఎంపి అరుణ
_____________________