పొట్లపల్లి  స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పణ

పొట్లపల్లి  స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు

IMG-20260215-WA0169హుస్నాబాద్, ఫిబ్రవరి 15, లోకల్ గైడ్:

మహా శివరాత్రి సందర్భంగా
సిద్దిపేట జిల్లాహుస్నాబాద్ నియోజకవర్గం పొట్లపల్లి  స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రి ప్రభాకర్
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...భక్తులకు మహశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.
హుస్నాబాద్ ప్రాంతమంతా సస్య శ్యామలంగా ఉండా లని, మంచి వర్షాలు కురిసి, పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకున్నారు.వచ్చే శివరాత్రి కి గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసుకొని, కాలువల ద్వారా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం సస్య శ్యామలంగా ఉండాలని దీనికి ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా కొనసాగాలని, భవిష్యత్ లో కూడా మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలని ఆ భగవంతుడు ఆశీర్వాదం తీసుకున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Tags:

About The Author

Latest News