డిప్యూటీ సీఎం తనయుడి వివాహ వేడుకలో  

సింగరేణి మండల కాంగ్రెస్ శ్రేణులు

డిప్యూటీ సీఎం తనయుడి వివాహ వేడుకలో  

ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, మార్చి 5 :

తెలంగాణ  రాష్ట్ర ఉపముఖ్యమంత్రి,  ప్రజా నాయకుడు  మల్లు భట్టి విక్రమార్క  తనయుడు  సూర్య విక్రమార్క  వివాహ  వేడుక గురువారం  రాజధాని హైదరాబాద్‌లో  అత్యంత వైభవంగా,  కన్నుల  పండువగా జరిగింది.  రాజకీయ,  సినీ, సామాజిక  రంగాలకు  చెందిన హేమాహేమీలు  హాజరైన  ఈ వేడుకలో  వైరా  నియోజకవర్గ ఎమ్మెల్యే  మాలోత్  రాందాస్ నాయక్  ప్రత్యేక  ఆహ్వానం మేరకు  సింగరేణి  మండల కాంగ్రెస్  నాయకులు  పెద్ద సంఖ్యలో  తరలివెళ్లారు..
​వైరా  ఎమ్మెల్యే  రాందాస్ నాయక్ పిలుపు  మేరకు, సింగరేణి మండలంలోని  భజ్యతండా  గ్రామ  పంచాయతీకి  చెందిన ముఖ్య  నాయకులు  ఈ చారిత్రాత్మక  వేడుకకు  సాక్ష్యంగా నిలిచారు. ఎమ్మెల్యే  వెంట  వెళ్లిన  వారిలో 
​వాంకుడోత్  హనుమంతరావు, (సర్పంచ్) , ​మాలోత్ విగ్నేష్  నాయక్ (ఎమ్మెల్యే తనయుడు), అజ్మీర  నారాయణ,  ​అజ్మీర హేమ్లా, ​అజ్మీర నరేన్, ​అజ్మీరా రవి, ​హాట్కార్ రాంబాబు నాయక్,  ​వీరితో  పాటు  సింగరేణి  మండల  కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు, కార్యకర్తలు  భారీగా  పాల్గొన్నారు.  ​ ఈ  సందర్భంగా నాయకులు  మాట్లాడుతూ.. తమ  ప్రియతమ  నేత, ఉపముఖ్యమంత్రి   కుటుంబ శుభకార్యంలో  పాల్గొనడం  ఎంతో  గర్వంగా,  సంతోషంగా ఉందని  హర్షం  వ్యక్తం  చేశారు. నూతన  దంపతులు  సూర్య విక్రమార్క  జంట  నిండు  నూరేళ్లు  సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో  వర్ధిల్లాలని వారు  మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
​ ఈ వివాహ  వేడుకలో  సింగరేణి మండల  కాంగ్రెస్  నాయకులు భాగస్వాములు  కావడం  స్థానిక రాజకీయ  శ్రేణుల్లో  కొత్త ఉత్సాహాన్ని  నింపింది. ఈ కార్యక్రమం  కేవలం  వివాహ వేడుకగానే  కాకుండా, పార్టీ నాయకుల  మధ్య  ఆత్మీయ అనుబంధాన్ని  బలపరిచే వేదికగా  నిలిచింది  పలువురు అభిప్రాయాన్ని  వ్యక్తం  చేసినారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.