హోలీ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ

ఎస్పీ డాక్టర్ వినీత్ ఉత్సాహంగా పాల్గొన్నారు.

హోలీ ఉత్సవాల్లో జిల్లా ఎస్పీ

నారాయణపేట మార్చి 4:

హోలీ పండుగ ఉత్సవాల్లో బుధవారం నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఉత్సాహంగా పాల్గొన్నారు.
హోలీ పండుగ సందర్భంగా ఇస్కాన్ (హరే రామ హరే కృష్ణ) పూజారి అడ్మిద్ నరసింహ దాస్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ను మర్యాదపూర్వకం గా కలసి, కలర్‌తో బొట్టు పెట్టి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.ఎస్పీ పూజారికి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీ పండుగను జరుపుకుంటా మని హోలీ పండుగను శాంతి, సామరస్యాల ప్రతీకగా భావించి ప్రతి ఒక్కరూ ఆనం దంగా, సురక్షితంగా జరుపు కోవాలని సూచించారు. సహజ సిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, రసాయనిక రంగులను దూరంగా ఉంచాలని తెలిపారు. పండుగ సంద ర్భంగా ఎవరూ అనవ సరంగా ఇబ్బందులకు గురికాకుండా పరస్పర గౌరవంతో వ్యవ హరించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:3.ఎస్పీకి హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఇస్కాన్ పూజారి
______________________

Tags:

About The Author

Latest News