ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ (ఐబీఓ) జాతీయ అవార్డుల ప్రదానం

భారతీయ విద్యా భవన్లో ఘనంగా నిర్వహించారు డైరక్టర్ రామకృష్ణ

ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ (ఐబీఓ) జాతీయ అవార్డుల ప్రదానం

కుత్బుల్లాపూర్ మార్చి 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) 

విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించే ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ (ఐబీఓ) జాతీయ అవార్డుల కార్యక్రమం భారతీయ విద్యా పవన్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐబీఓ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ, ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ 2016లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పొందిన తర్వాత దేశవ్యాప్తంగా ఒలింపియాడ్ పరీక్షలను నిర్వహిస్తూ వస్తోందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఒకసారి నిర్వహించే ఈ పరీక్షలకు దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారని చెప్పారు.2025–26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన పరీక్షల్లో సుమారు 20,000 మంది విద్యార్థులు ఫస్ట్ లెవెల్ పరీక్షకు హాజరయ్యారని, అందులో ప్రతిభ కనబర్చిన 250 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్ పరీక్షకు ఎంపికై హాజరయ్యారని వివరించారు. ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టాపర్లకు ఐబీఓ తరఫున జాతీయ అవార్డులు అందజేయడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా తృతీయ తరగతి నుండి పదో తరగతి వరకు నమోదు చేసుకున్న విద్యార్థులు ఈ ఒలింపియాడ్ పరీక్షలకు అర్హులని తెలిపారు. విద్యార్థులు విజయం సాధించడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందించిన సహకారం ఎంతో ముఖ్యమని, అందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జగజీవన్ రెడ్డి, రాజు, డాక్టర్ భువన తదితరులు పాల్గొని విజేత విద్యార్థులను అభినందించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.

Tags:

About The Author

Latest News