రంజాన్ సందర్భంగా ‘ఈద్ కా తోఫా’ బట్టల పంపిణీ

ముస్లిం సోదరులకు అండగా నిలిచిన మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్

రంజాన్ సందర్భంగా ‘ఈద్ కా తోఫా’ బట్టల పంపిణీ

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

కొండాపూర్ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న అల్ జమల్ అల్ హరిరీ మసీదు వద్ద శనివారం “ఈద్ కా తోఫా” పేరిట బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ పాల్గొని ముస్లిం సోదర సోదరిమణులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హమీద్ పటేల్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం సోదరభావం, సేవాభావం, పంచుకునే సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు. పేద, అవసరమైన వారికి సహాయం చేయడం ద్వారా పండుగ ఆనందం మరింత పెరుగుతుందని తెలిపారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందించేందు కు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వహీద్ ఖాన్, సలీం, మజారుద్దీన్, ఫెరోజ్, సమీర్, అబ్బాస్, మతీన్, అసఘర్, యాకుబ్, నవీద్, మునీర్ ఖాన్, ఇక్బాల్, జాఫర్ అలీ, సలీం భాయ్, అజ్మాత్, మొహ్మద్ వసీం తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ముస్లిం సోదర సోదరిమణులకు పండుగ ఆనందాన్ని పంచడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

Latest News