ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలి.
ఎన్.సి.డి. సర్వే నిర్వహణపై వైద్య అధికారులు దృష్టి సారించాలి
ఖమ్మం :లోకల్ గైడ్:
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.*బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ వివిధ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.*
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* పి.హెచ్.సి. లలో పని చేసే ప్రతి సిబ్బంది అటెండెన్స్ ను పర్యవేక్షించాలని, అనుమతిలేని సెలవులు, గైర్హాజరుపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏఎన్సి రిజిస్ట్రేషన్ వంద శాతం జరగాలన్నారు. 4 సార్లు పరీక్షలు జరిగివుండాలని తెలిపారు.*ప్రతి వైద్యాధికారి తన పరిధిలోని ఆశా కార్యకర్తలతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.* ప్రయివేటు ఆసుపత్రుల్లో ఆపరేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రతి కేసును పరిశీలించి, అవసరంలేని ఆపరేషన్లు నిరోధించాలన్నారు.*గర్భిణీ లకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రైవేట్ ఆసుపత్రులపై కూడా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.* ఆశా కార్యకర్తలు రెగ్యులర్ గా తమ పరిధిలో ఇంటింటి సర్వే చేస్తూ గర్బీణి మహిళల వంద శాతం ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. *ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఉన్న వసతులు ప్రైవేటు ఆసుపత్రులలో లేవని దీనిపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని, సి సెక్షన్ డెలివరీలను నివారించాలని అన్నారు.* ప్రతి సెక్షన్ ఆపరేషన్ పై ఆడిట్ రిపోర్ట్ ఉండాలని అన్నారు. *ప్రతి పి.హెచ్.సి. పరిధిలో వంద శాతం పిల్లలకు టీకాలు వేయించాలని, వైద్య అధికారులు టీకాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.* ప్రతి ఆశా కార్యకర్త ఫాలో అప్ చేయాలని అన్నారు. ఎల్ఎంపి రిజిస్టర్స్ రాయాలని కలెక్టర్ అన్నారు. *ప్రతి పి.హెచ్.సి. పరిధిలో ఎన్.సి.డి. సర్వే పూర్తి చేసి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, వైద్య అధికారులు తమ పరిధిలో ఆశా కార్యకర్తలతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు.* ఎన్.సి.డి. సర్వె నిర్వహణలో ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎం, ఎం.ఎల్.హెచ్.పి. పాత్ర ఎంత ఉండాలో నిర్దేశించుకోవాలని అన్నారు. *ఆరోగ్య మహిళకి వైద్యాధికారికి లక్ష్యాలు ఇచ్చి, వాటిని ఆన్లైన్ చేసి, మానిటరింగ్ చేయాలన్నారు.*
టీబీ నిర్మూలనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, నిర్దేశించిన లక్ష్యం మేరకు అనుమానితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.*తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ ద్వారా వైద్య పరీక్షల ఫలితాలు త్వరగా అందించేలా చూడాలని అన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి సంబంధించి ఎంత మంది ఓపి, ఎన్ని సాంపుల్ సేకరించింది, ఎన్ని రిపోర్టులు 24 గంటల్లో అందించింది, ఎన్ని తిరస్కరించింది వివరాల నివేదిక ప్రతినెలా సమర్పించాలన్నారు.* ప్రభుత్వ ఆసుపత్రులలో పరీక్షలు జరిగినప్పుడు ప్రజలకు మనపై నమ్మకం పెరుగుతుందని అన్నారు. ప్రతి పి.హెచ్.సి.కి లక్ష్యాలు కేటాయించి వైద్య పరీక్షల శాంపిల్స్ సేకరించాలని అన్నారు. ఆర్బిఎస్ కె టీమ్ వంద శాతం పిల్లల్ని స్క్రీనింగ్ చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలని, ప్రభుత్వ వసతి గృహాలు రెగ్యులర్ గా సందర్శించి, అవసరమైన పిల్లలకు వైద్య సేవలు అందించాలని అన్నారు. సికిల్ సెల్ లక్ష్యం పూర్తి చేయాలని, గుర్తించిన వారికి తగు చికిత్స అందించాలని తెలిపారు. ఎయిడ్స్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపారు. మధిరలో క్రొత్త బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. *కంటి వెలుగు కార్యక్రమంలో ఆపరేషన్ల అవసరం గుర్తించిన వారికి ఆపరేషన్లు చేపట్టాలని అన్నారు. దత్తత నియమాల ప్రకారం పొందేలా చూడాలన్నారు. మూడవ అమ్మాయి పుట్టినచోట వారిని ట్రాక్ చేయాలన్నారు.* వేసవికాలంలో హీట్ వేవ్ దృష్ట్యా ఓఆర్ఎస్, ప్రధమ చికిత్స మందులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
*ఈ సమావేశంలో* జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. చందు నాయక్, డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారి డా. వేణు మనోహర్, పీవో లు డా. సుబ్బారావు, డా. బిందుశ్రీ, డా. ప్రవీణ, ప్రోగ్రామ్ అధికారులు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు, తదితరులు *పాల్గొన్నారు.*
