ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు
ఘనంగా ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభం
నోటికి తాళం వేసుకుని పెద్దబోనం సమర్పించిన సాయమ్మ
నారాయణపేట జనవరి 27
నారాయణపేట జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన లింగంపల్లి రేణుకా ఎల్లమ్మ జాతర మహోత్సవాలు మంగళ వారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగ ణంకిటకిటలాడింది.మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పూజారి సాయమ్మ పుట్టం కట్టుకుని నోటికి తాళం వేసుకొని అమ్మవారికి ప్రదక్షిణ చేసి పెద్దబోనం సమర్పించా రు. అనంతరం సాయమ్మ నోట తాళం అదంతట అదే ఉడిపోవడంతో భవిష్యవాణి వినిపించారు. పెద్దబోనం అనంతరం మహిళలు పునకాలతో లింగంపల్లి ఊగి పోయింది. వేలాది మంది అమ్మవారికి బోనాలు సమర్పించి కోళ్లు, మేకను బలిచి కల్లు నైవేదించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే జోగినిలుగా మారిన మహిళలు పుట్టం (వేపాకు) ధరించి నగ్నపునకా లుపు నారు. జాతర ఉత్సవాలకు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా గ్రామాలకు వచ్చి అమ్మవారి మొక్కలు తీర్చుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్ర దేశ్, తెలంగాణా వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివ చ్చారు. ఈ సారి జాతర ఏర్పాట్లను నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
ఫోటో రైట్ అప్:6.నోటికి తాళంతో ప్రదక్షణ చేసిన పూజారి సాయమ్మ,
7.పెద్దబోణం సమర్పణ
8.బోనాలతో పోటెత్తిన భక్తులు
8.పూజలందుకున్న ఎల్లమ్మ తల్లి
