చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ 

వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ 

 

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వీ పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులIMG-20260206-WA0223 కేసులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఓపీ విభాగం, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్, మందుల గది, డయాలసిస్ కేంద్రం తదితర అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సిబ్బంది జిల్లా కలెక్టర్‌కు వివరించారు. రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటెండెన్స్ రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు. విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును కూడా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అవసరమైన మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రోగులకు సూచించారు. అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య కేంద్రంలో మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందుల కోసం ఒక నెల ముందుగానే మెడిసిన్ ఇండెంట్ సమర్పించాలని మెడికల్ ఆఫీసర్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని రకాల అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, కల్పించవలసిన వసతులపై సమగ్ర నివేదిక అందించాలని, వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి వర్ధన్, వైద్యులు కాంత్, రవికుమార్, నర్సులు, ఫార్మసిస్ట్‌తో పాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News