మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన _ప్రగతి ప్రణాళిక

జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన _ప్రగతి ప్రణాళిక

అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి

నారాయణపేట మార్చి 4:

జిల్లాలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారని, 99 రోజుల్లో శాఖల వారీగా ప్రభుత్వం చేపడుతున్న  కార్య క్రమాలపై బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఫణిందర్ రెడ్డి వివరించారు. బుధవారం కలెక్టరేట్ విసి హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ మార్చి 6 నుండి జూన్ 12 వరకు జరిగే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెల 6 నుండి 15 వరకు అన్ని మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలలో శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు నిర్వహణపై కమిషనర్ చైర్మన్ వైస్ చైర్మన్, సర్పంచ్ ,కౌన్సిలర్లు పాల్గొంటారని తెలిపారు. అలాగే ఫైల్స్ డిస్పోజల్ ఫైల్స్ క్లియరెన్స్ చేయాలన్నారు. మార్చ్ 16 నుండి 31 వరకు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేయాలన్నారు. జూన్ 2 వరకు ఇందిరమ్మ గృహ ప్రవేశాలు పూర్తి చేయాల న్నారు. ప్రతి మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మించాల న్నారు. విద్యుత్ శాఖ వారు సోలార్ ఎనర్జీ కార్యాలయా లలో స్కూళ్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. పోలీసు రవాణా శాఖ ఆధ్వర్యంలో అరైవ్, అలైవ్ కార్యక్రమాలు ఏప్రిల్ 13 నుండి 18 వరకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. సంక్షేమ శాఖ వారు ఏప్రిల్ 20 నుండి 24 వరకు వారి కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ వారు నాలుగు మే నుండి 9 వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇతర పనులను చూడాలన్నారు. సంక్షేమ శాఖ మహిళలు అంగన్వాడి తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలె క్టర్  రెవిన్యూ శ్రీను జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ 
_____________________

Tags:

About The Author

Latest News