మైనర్లు వాహనాలు నడిపితే చట్టప్రకారం కఠిన చర్యలు:
ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
నారాయణపేట మార్చి 4:
జిల్లాలో మైనర్‌లు వాహనా లు నడపడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీ కృష్ణ చైతన్య హెచ్చరించారు. మైనర్లు వాహ నాలు నడిపితే రోడ్డు ప్రమాదా లు జరుగుతాయని, మైనర్లు వాహనాలు నడుపుతూ త్రిబుల్ రైడింగ్ నేపథ్యంలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపా రు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ 18 సంవత్స రాలు నిండక ముందే ద్విచక్ర వాహనాలు లేదా నాలుగు చక్రాల వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. మైనర్‌లు వాహనా లు నడిపితే కేవలం వారిపైనే కాకుండా తల్లిదండ్రులు, వాహన యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మోటార్ వాహనాల చట్టం ప్రకారం మైనర్ వాహనం నడిపితే వాహన యజమానికి భారీ జరిమానా విధించబ డుతుంది.సంబంధిత తల్లి దండ్రులు,గార్డియన్లపై కేసులు నమోదు చేయబడతాయనీ హెచ్చరించారు.వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
మైనర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ పొందడంపై నిర్దిష్ట కాలం పాటు అనర్హత విధించబ డుతుంది.యువత తాత్కా లిక ఉత్సాహంతో, సరైన అనుభవం లేకుండా వాహ నాలు నడపడం, త్రిబుల్ రైడింగ్ లో రాష్ గా వాహ నాలు నడపడం వల్ల ప్రాణ నష్టం, తీవ్ర గాయాలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమా లను కచ్చితంగా పాటించా లని సూచించారు. తల్లి దండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మైనర్ డ్రైవింగ్‌ను ప్రోత్స హించకూడదని విజ్ఞప్తి చేశారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు కూడా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని కోరారు.
జిల్లాలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి తనిఖీలు చేపడతామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య స్పష్టం చేశారు.
ఫోటో రైట్ అప్:6.అవగాహన కల్పిస్తున్న పోలీసులు
______________________
