పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలి
బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
మిర్యాలగూడ మార్చి 6
( లోకల్ గైడ్ తెలంగాణ)
పెండింగ్లో ఉన్న బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేస్తున్న బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులు ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లపై ఆధారపడి విద్యని అభ్యసిస్తున్న సందర్భంలో ప్రభుత్వం విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్స్ నేటికీ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు పరీక్షల సమయంలో తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు ఫీజు చెల్లిస్తేనే కులాశాల యాజమాన్యాలు హాల్ టికెట్స్ ఇస్తామంటూ లేకపోతే హాల్ టికెట్స్ ఇవ్వమని విద్యార్థులను బెదిరిస్తున్న సందర్భం అలాగే కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో ఉన్నత చదువులు చదువు కోలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డదని ఆయన అన్నారు ప్రభుత్వం గాంధీ విగ్రహానికి 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ పేద విద్యార్థులు చదువుకునే చదువులకు మాత్రం ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ఆయన హెచ్చరించారు అంటే పేద విద్యార్థులు చదువుకోకూడ దా అంటూ ఆయన హెచ్చరించారు ఇకనైనా ప్రభుత్వం పేద విద్యార్థుల పక్షాన ఆలోచన చేసి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలో చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జక్క నాగేశ్వరావు, పోలగానే వెంకటేష్ గౌడ్, ఎర్రబెల్లి గంగాధర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు.
