తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే

19 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ దాటిన హస్తం.

తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే

లోకల్ గైడ్ తాండూర్: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అత్యథిక స్థానాలను గెలుచుకుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతోంది. కాగా కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో కారు పార్టీకి మ్యాజిక్ ఫిగర్‌ కంటే తక్కువ స్థానాలను దక్కించుకుంది.శుక్రవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్‌ నుంచి బీఆర్ఎస్ పార్టీ దూకుడు కనిపించినా.. రెండో రౌండ్‌, మూడో రౌండ్‌లలో వెనుకబడి పోయింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ 19 స్థానాల్లో గెలిచి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. ఇదిలా ఉంటే పట్టణంలోని 2వ వార్డులో ప్రత్యూష, 3వ వార్డులో సుల్తానా, 4వ వార్డులో మెహర్ ఉన్నీసాభేగం, 11వ వార్డులో బంటు వేణు,12వ వార్డులో పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి,14వ వార్డులో మహియా అంజూమ్, 15వ వార్డులో దివిటి ఎల్లప్ప, 16వ వార్డులో నారా శ్రీలత, 17వ వార్డు సనా తబస్సుమ్, 19వ వార్డు జుంటుపల్లి వెంకట్, 21వ వార్డు సభా ఫాతిమా, 22వ వార్డు రామకృష్ణ, 24వ వార్డు బాలకృష్ణారెడ్డి, 26వ వార్డు వైశాలి గౌడ్, 27వ వార్డు స్వరూప మల్లేశం, 29వ వార్డు అబ్దుల్ రజాక్, 30వ వార్డు మెహరాజ్ భేగం, 35వ వార్డు అప్షామైనా భేగంలు విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 స్థానాలు సాధించి మున్సిపల్‌లో హవా కొనసాగించింది. ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్ చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే చైర్మన్ పీఠాన్ని అధిరోహించబోతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు టపాసులు పేల్చీ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 12స్థానాలు, బీజేపీ 3, ఎంఐఎం 1, ఇండిపెండెంట్‌ -1 స్థానాలను సాధించుకున్నాయి.

Tags:

About The Author

Latest News

బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్   *శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*   *డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*   *ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు
తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే
విద్యార్థులు ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్లాలి. 
నాటు సార విక్రేత అరెస్టు.
అతివేగంతో ఆటోను ఢీ కొట్టిన బైక్.
నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.