కార్పొరేషన్లు మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడం సంతోషం
సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మన బోయిన కేశవులు ముదిరాజ్.
రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంపట్ల సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా.బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఏ ఎన్నికలలో నైనా ఓటింగ్ శాతం పెంచేందుకు, ఎన్నికలలో అక్రమాల నిరోధానికి కృషిచేస్తున్నదని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్రంలో 73.01 ఓటింగ్ శాతం నమోదైందని వివరించారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులు, సభ్యులు ఓటింగ్ శాతం పెంచేందుకు విసృతంగా ప్రచారం చేశారని తెలిపారు. ర్యాలీలు, సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న అన్నివర్గాల ప్రజలకు, ఎన్నికలు నిర్వహణలో పాలుపంచుకున్న అధికారులకు, సిబ్బందికి, శాంతిభద్రతలు పర్యవేక్షించిన ఎస్పీ, డీఎస్పీ లు, ఇతర పోలీసు అధికారులకు, అంగన్వాడీ సిబ్బందికి, వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
