ఏకలవ్య ఫౌండేషన్ సేవలు అద్వితీయం.
ఫౌండేషన్ అభివృద్ధికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
లోకల్ గైడ్/ తాండూర్:
తాండూరు మండలం జీనుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ సేవలు అద్వితీయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
సందీపని గురుకులం ఆవరణలో పలు భవనాలను ప్రారంభోత్సవ, శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ , కేంద్ర మంత్రి భూపతి రాజ్ శ్రీనివాస్ వర్మ గారు, ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు, బాగయ్య తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా స్పీకర్ ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం అయిన జిన్ గుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.విద్యను వ్యాపారం చేయకూడదనే ఉద్దేశ్యంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్ కు ఎల్లప్పుడూ తమ వంతు సహాకారం ఉంటుంది అని భరోసానిచ్చారు.ధీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ అతి తక్కువ సమయంలోనే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతల నుండి ప్రముఖులను ఫౌండేషన్ ఒకే వేదిక పైకి తేచ్చింది. భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి దేశానికి నాయకత్వం వహించే ఎంతో మంది నాయకులను, ఐఏఎస్ లను, శాస్త్రవేత్తలను, డాక్టర్స్ ను, లాయర్లను, అధికారులను ఎంతో మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుండి దేశానికి ఫౌండేషన్ అందించబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ అందరికి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్స్ పాఠశాల మన తాండూర్ లో పనులు ప్రారంభించడం జరిగింది అని తెలిపారు. యువతకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ఏటీసీ సెంటర్ ను ప్రారంభించామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు, ఏకలవ్య ఫౌండేషన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
