4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడలకు సర్వం సిద్ధం

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్.

4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడలకు సర్వం సిద్ధం

సైబరాబాద్, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆతిథ్య మిస్తున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సీపీ డాక్టర్ ఎం.రమేష్ తెలిపారు. క్రీడలకు సంబంధించిన వసతి, భోజనం, రవాణా, భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. రాష్ట్రంలోని 3 కమిషనరేట్లు, 7 జోన్లు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఇంటెలిజెన్స్, రైల్వే పోలీస్, టీఎస్ఎస్పీ బెటాలియన్ల నుంచి మొత్తం 2,532 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరిలో 1,933 మంది పురుషులు, 599 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. మొత్తం 31 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, షూటింగ్, బ్యాడ్మింటన్, యోగా తదితర విభాగాలలో పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులకు తెలంగాణ పోలీస్ అకాడమీ  లోని బ్లాకులలో 806 పడకల వసతి, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు కల్పించారు. ఫిబ్రవరి 18న సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభోత్సవం జరుగుతుంది.  గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం,  దుర్గం చెరువు, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం తదితర వేదికలలో పోటీలు నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 20న ‘బడా ఖానా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. క్రీడాకారుల సౌకర్యాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నోడల్ అధికారులకు సీపీ ఆదేశించారు. ఈ క్రీడలు పోలీసు సిబ్బందిలో ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వృత్తి ఒత్తిడికి ఉపశమనం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు