విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు ఇంచార్జి ఎస్సై గాయత్రి.

విద్యార్థులకు రోడ్డు భద్రతపై వ్యాసరచన పోటీలు ఇంచార్జి ఎస్సై గాయత్రి.

నారాయణపేట మార్చి 26:

నారాయణపేట రూరల్ పోలీ స్ స్టేషన్ పరిధిలోని జాజాపూర్ పాఠశాలలో అరయ్ అలైవ్ ముడో విడత రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థు లకు చిన్నప్పటినుంచే రోడ్డు భద్రత నియమాలపై అవగా హన కల్పించడం ఎంతో అవసరమని ఎస్ఐ గాయత్రి తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు దాటేట ప్పుడు జాగ్రత్తలు పాటించ డం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌర వించడం, హెల్మెట్ సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ వంటి ముఖ్యమైన రోడ్డు భద్ర త నియమాలను వివరించా రు. చిన్న వయసులోనే ఈ నియమాలు అలవర్చుకుంటే భవిష్యత్తులో రోడ్డు ప్రమా దాలు గణనీయంగా తగ్గు తాయని వారు పేర్కొన్నారు.

వ్యాసరచన పోటీలో విద్యా ర్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రత ప్రాముఖ్యతను తమ మాటల్లో వివరించారు. పోటీలో ఉత్తమ ప్రతిభ కనబ రిచిన విద్యార్థులను అభినం దించి అవార్డులు ప్రధానం చేశారు. ఇటువంటి అవగా హన కార్యక్రమాలు విద్యా ర్థుల వ్యక్తిత్వ వికాసానికి, సమాజ భద్రతకు దోహద పడతాయని తెలిపారు.

అరయ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు తప్పని సరిగా పాటించి, సురక్షిత ప్రయాణాన్ని అలవర్చు కోవాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్:4.వ్యాసరచన పోటీలో పాల్గొన్న విద్యార్థులు 

_______________________

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన