చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.

ఇముల నర్వ సర్పంచ్ లలిత గోపాల్ నాయక్

చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.

చిన్నారులకు భోజన వసతి కల్పించిన ఉపసర్పంచ్ ఎస్.డి సిరాజ్

*

 

 

లోకల్ గైడ్ కొత్తూరు.

భావితరాల ఉజ్వల భవిష్యత్తు, చిన్నారుల మానసిక వికాసం కోసం తప్పనిసరిగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఇముల నర్వ సర్పంచ్ లలిత గోపాల్ నాయక్ అన్నారు. బుధవారం కొత్తూరు మండలంలోని ఇముల నర్వ అంగన్వాడి కేంద్రంలో సూపర్వైజర్ రేవతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా సర్పంచ్ లలిత గోపాల్ నాయక్,ఉపసర్పంచ్ ఎస్.డి సిరాజ్ హాజరై ప్రీస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు ఉపసర్పంచ్ ఎస్.డి సిరాజ్ భోజన వసతి ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మూడేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీలకు పంపించాలని, చిన్నారుల మానసిక, వ్యక్తిత్వ వికాసం వృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవికుమార్ గుప్తా,నాట్కో ట్రస్ట్ సూపర్వైజర్ ఉమారాణి,జ్యోతి, ధరణి, అంగన్వాడి టీచర్లు యాదమ్మ,శోభ,ఇందిరా,నాట్కో వాలంటీర్స్ సరిత,కరుణ, యమున,రాధిక, ఏఎన్ఎమ్స్ ఆశా వర్కర్స్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన