రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన

సర్పంచ్ వీసాం మోతీ వీరస్వామి పాలకవర్గ సభ్యులు

రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన

కాంగ్రెస్ పార్టీ జిల్లా, మాజీ దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య 

 

-

-ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఏప్రిల్ 08 :

కారేపల్లి మండలం రేగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రొట్టమాకు రేవు గ్రామంలోనీ రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వీసాం మోతీ వీరస్వామి , ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ , పాలకవర్గ సభ్యులు , జిల్లా కాంగ్రెస్ నాయకులు,మాజీ దేవస్థాన చైర్మన్ అడ్డ గోడ ఐలయ్య . జిల్లా నాయకుడు ఐలయ్య, గ్రామ పెద్దలు బుర్ర స్వామి , సర్పంచ్ చొరవతో  సీ సీ  రోడ్డు నిర్మాణం కొరకు  ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారం తో నిధులు  మంజూరు  చేయించి బుధవారం నాడు సీ సీ రోడ్డు వేయడం జరిగింది .గ్రామ పంచాయతీ లోని రైతుల సౌకర్యం కోసం, అధికారులు , రైతులు ప్రతిరోజు రైతు వేదిక వద్దకు రావడం ఎంతో ఇబ్బందికరంగా ఉండేదాని దానిని  దృష్టిలో  పెట్టుకొని గ్రామ పంచాయతీ సర్పంచ్ మోతీ వీరస్వామి  అభివృద్ధిలో భాగంగా   బుధవారం నాడు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది .సర్పంచ్, జిల్లా నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లోని మిగతా రోడ్లు, సైడ్ డ్రైనేజీలు అన్ని గ్రామాలలో  త్వరలోనే  స్థానిక  శాసనసభ్యులు  మాలోత్ రాందాస్ నాయకత్వంలో గ్రామ పంచాయతీలో రోడ్లు  త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా  జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు , పార్లమెంటు సభ్యుల సహకారంతో  గ్రామంలో  ఉన్న సమస్యలను  వారి  దృష్టికి తీసుకవెళ్లి , ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తావని ఇరువురు పేర్కొన్నారు . ఈ  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఈసం రవికుమార్, ఉపసర్పంచ్ ఆవుల సత్యనారాయణ ,నాయకులు బుర్ర స్వామి , గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పిట్టల కార్తీక్ , సైదేశ్వర రావు , సర్వయ్య , కళావతి రాణి , శ్రీలత , గ్రామ పెద్దలు ఇరప్పా బక్కయ్య , వెంకటేశ్వర్లు , వినోద్ , నాగరాజు, శ్రీను , పాపారావు  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన