( లోకల్ గైడ్ షాద్ నగర్)
ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్థానిక కౌన్సిలర్ లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందని అన్నారు.నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నదని వారు చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన్ గౌడ్,కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్,మాధవి గోపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ ఏనుగు జనార్దన్ రెడ్డి,మండల యూత్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్ గౌడ్,నాయకులు శివ కుమార్ గౌడ్, పాశం కృష్ణ, చింత సాయి తేజేశ్వర్,తదితరులు పాల్గొన్నారు.