విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రోగ్రామ్ - 2025–26 లో భాగంగా జిల్లేడు చౌదర్ గూడా మండలంలోని కేజీబీవీ పాఠశాలలో 9వ తరగతిలో క్లాస్ టాపర్ గా చదువుతున్న విద్యార్థినీ కుమారి పాతులవత్ బిందు, 8వ తరగతి చదువు తున్న ఎన్. శిరీష క్లాస్ టాపర్ నిలవడంతో వీరికి ఒక్కొక్కరికి రూ. 3000/- ల చొప్పున (చెక్కు లు) నగదు మెమొంటోలను అందజేశారు. ఈ సందర్బంగా రాగసుధ మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఇట్టి అవార్డులు గతంలో ఎంపీడీవో పనిచేసిన మహేష్ బాబు ప్రోద్బలంతో మా పాఠశాలలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయన్నారు.
శ్రీ లక్ష్మీనారాయణ సిఎస్ఆర్ మేనేజర్...
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 8, 9 తరగతులలో ప్రధమ స్థానం లో నిలిచిన 100మంది కి ముతూట్ ఫైనాన్స్ ఎక్సలెన్స్ అవార్డు తో రూ. 3000/- లతో పాటగా మెమొంటోలను అందజేశారు. విద్యార్థిని, విద్యార్థులు విద్యలో ఉన్నత స్థానంలో నిలిచి మన దేశానికి, వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఈ స్కాలర్‌షిప్ ప్రోత్సాహంతో పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రయోజనం పొందుతారన్నారు. ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాల ద్వారా చాలా మంది పిల్లలకు, వారి కుటుంబాలకు చిరునవ్వులు అందించడంతోపాటు వారిలో విశ్వాసo తెచ్చిపెట్టిందని అని ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ మేనేజర్ లక్ష్మీనారాయణ తెలియజేశారు.
