అంగన్వాడి కేంద్రంలో అందించే ప్రతి సేవను సద్వినియోగం చేసుకోవాలి.

ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది.

అంగన్వాడి కేంద్రంలో అందించే ప్రతి సేవను సద్వినియోగం చేసుకోవాలి.

 

 మిర్యాలగూడ మార్చి 28 
( లోకల్ గైడ్ తెలంగాణ )

మిర్యాలగూడ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ రేఖల మమతా ఆదేశాల మేరకు సీతారాంపురం సెక్టర్ పరిధి  లో గల నంది పహాడ్ -2 అంగన్వాడి కేంద్రం నందు ప్రతినెల 4వ శనివారం నిర్వహించే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో సూపర్వైజర్ సి.హెచ్.పద్మ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రీస్కూల్ విద్యను ప్రైవేట్ విద్యా సంస్థలకు దీటుగా అందిస్తున్నాము పిల్లల యొక్క మానసిక శారీరక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా ఆట పాట కథ సృజనాత్మకత ఈ విధమైనటువంటి కార్నర్స్ను ఉపయోగిస్తూ పిల్లలకు బోధించడం జరుగుతుంది. ఇతరులతో కలిసిమెలిసి ఉండడం చిన్న వయసులో సరైన పోషకాహారం విద్య లభించకపోతే అది వారి జీవితాంతం ప్రభావం చూపుతుంది. అంగన్వాడి కేంద్రాలు ప్రీస్కూల్ ద్వారా పిల్లలకు ఆహారం టీకాలు ప్రాథమిక విద్య అందుతాయి పిల్లలను ప్రాథమిక పాఠశాల విద్యకు సిద్ధం చేయటానికి సహాయపడుతుంది. పిల్లలే దేశ భవిష్యత్తు వారికి చిన్నతనంలోనే అంగన్వాడీ కేంద్రంలో ప్రేమతో కూడిన సంరక్షణ అందిస్తే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వివరించినారు. కావున ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రంలో అందించే ప్రతి సేవను సద్వినియోగం చేసుకోవాలని  3 నుండి 6  సంవత్సరాల పిల్లల తల్లులకు వివరించుకుంటూ కృత్యాలను తల్లుల ముందు పిల్లలచే ప్రదర్శించినాము 
ఈ యొక్క కార్యక్రమంలో 
 సూపర్వైజర్ పద్మ
 అంగన్వాడీ టీచర్,శేషు మని
 అంగన్వాడీ హెల్పర్ కరుణ,
 ఆర్ పి  లు సరిత, ప్రసన్నలక్ష్మి ప్రీస్కూల్ పిల్లలు తల్లిదండ్రులు కిశోర బాలికలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం, విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలి - కేజీబీవి పి రాగసుధ జిల్లేడు చౌదరి గూడెం,
  ( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
చిన్నారులను అంగన్‌వాడీల్లో చేర్పించాలి.
ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి పేదవాడికి నీడ - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
వేసవి సెలవుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....
రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారిపై కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ చైతన్య
భాగ్యనగర్ తండా -4 అంగన్వాడీ కేంద్రంలో స్పెషల్ గ్రోత్ డ్రైవ్ ప్రోగ్రామ్ 
రొట్టమాకు రేవు గ్రామంలో రైతు వేదిక వద్ద సీసీ రోడ్డు శంకుస్థాపన