ప్రతి గృహిణి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి...
By Ram Reddy
On
మహిళలు ఇంటి పనులతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని15వ వార్డు కౌన్సిలర్ చింతల వసంత పిలుపునిచ్చారు.వార్డులోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మహిళలకు చిన్నారులకు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఇంట్లోని గృహిణీలు ప్రతిరోజు తమ కుటుంబ సభ్యుల బాగోగులు చూస్తు తమ ఇంటి పనిలో నిమగ్నమై తమ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తారని అలా కాకుండా మహిళలు తమ ఇంటి పనితో పాటు తమ ఆరోగ్య పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు.ప్రతి గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబ జీవన విధానం ముందుకు సాగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పద్మ స్థానిక మహిళలు చిన్నారులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
17 Apr 2026 20:26:09
నారాయణపేట ఏప్రిల్ 17:
కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
