పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

కలెక్టర్ సిక్తా పట్నాయక్ 

పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

నారాయణపేట ఫిబ్రవరి 16:
ఈ నెల 25 నుండి మార్చి 16వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు.
ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పరీక్షల నిర్వహణ చేపట్టాలని అన్నారు. సోమ వారం ఆమె కలెక్టర్ కార్యా లయం లో వి.సి. సమావేశ మందిరం లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుండి మార్చి 16 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు  జరగనున్నాయని  తెలిపారు.
     ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు. పిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 16వరకు 15 కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకుTheory పరీక్షలు నిర్వహించటం జరుగుతుందని ఆమె తెలిపారు.ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షల కోసం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో , ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. మొదటి సంవత్సరం 4409, రెండవ సంవత్సరం 3783 మొత్తం 8192 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. మొత్తం పరీక్షా కేంద్రాలు 15 చీఫ్ సూపర్డెంట్లు 15 డిపార్ట్మెంటల్ అధికారులు 15 అడిషనల్ చీఫ్ సూపర్డెంట్లు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఒకటి సిట్టింగ్స్ స్క్వాడ్ ఇద్దరు  కస్టడియన్ అధికారులు పని చేస్తారని తెలిపారు.
   ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు పలు సూచనలను, ఆదేశాలను జారీ చేస్తూ పరీక్షల సందర్భంగా 144 వ సెక్షన్ విధించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేయాలని,
పరీక్షా కేంద్రం చుట్టూ జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షలు నిర్వహించే ఫిబ్రవరి 25 నుండి మార్చి 16వరకు ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా ఇవ్వాలని, సీసీ కెమెరాల మధ్య పరీక్షలు నిర్వహించనున్నందున విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఉండకుండా చూడాలని విద్యుత్ శాఖ  అధికారులను కోరారు. అదేవిధంగా పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల లో  తాగునీరు, లైటింగ్, ఫర్నిచర్, ప్యాన్ లు ఏర్పాటు చేయాలని  ఆదేశించారు. పరీక్షా కేంద్రాలలో నగర, పట్టణ ప్రాంతాలలో, మండలం లలో పారిశుధ్యం నిర్వహణకు చర్యలు తీసుకోవాలనిమున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు ఫస్ట్ ఎయిడ్, ఏఎన్ఎం లను, మందులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతం నుండి అలాగే పట్టణ ప్రాంతాలలో సరైన బస్సులు నడపాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. పోస్టల్ అధికారులు ప్రశ్నపత్రాలు భద్రంగా డిపాజిట్ చేసుకోవాలని ఈ సందర్భంగా  కలెక్టర్ తెలిపారు.ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రశాంతంగా నిర్వహించేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. పరీక్షా కేంద్రం లోకి ఎవరికి సెల్ ఫోన్ లు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
 ఈసమావేశం లో  అదనపు కలెక్టర్  శ్రీను,  డిఇసి కన్వీనర్ సుదర్శన్ రావు సభ్యులు శ్రీనివాసులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ 
________________________

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు