మహాశివరాత్రి సందర్భంగా అల్వాల గ్రామంలో బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

సంప్రదాయ బండలాగుడు పోటీలకు ఘనంగా శ్రీకారం చుట్టారు.

మహాశివరాత్రి సందర్భంగా అల్వాల గ్రామంలో బండలాగుడు పోటీలకు ఘన ప్రారంభం

   లోకల్ గైడ్  కేశంపేట :       

మండలం పరిధిలోని అల్వాల గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయ బండలాగుడు పోటీలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించే బండలాగుడు పోటీలు నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడంతో పాటు యువతలో ఉత్సాహాన్ని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామంలో ఐక్యత, సాంస్కృతిక పరంపరలను కాపాడటంలో ఈ పోటీలు ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ మల్లేష్, కమిటీ అధ్యక్షులు మరియు సభ్యులు, శ్రీనివాస్, మాధపురం మల్లేష్, తిరుమల రెడ్డి వెంకటేష్, చేగురి శ్రీశైలం, పాండు, ఆర్ శంకరయ్య, ఏ చంద్రశేఖర్, నరేష్ కుమార్, కుమ్మరి రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై పోటీలను ఆసక్తిగా వీక్షించారు.

బండలాగుడు పోటీలు ఉత్సాహభరితంగా కొనసాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని, పాల్గొన్న వారిలో ఆనందం వెల్లివిరిసింది.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు