ఏదులాపురం మున్సిపాలిటీలో కొత్త నాయకత్వం
చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్‌కు కాంగ్రెస్ నేత లింగాల రవికుమార్ అభినందనలు
By Ram Reddy
On
ఖమ్మం: లోకల్ గైడ్
ఖమ్మం: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికైన పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా ఎన్నికైన తమ్మినేని నవీన్, నూతన కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నాయకుడు లింగాల రవికుమార్ అభినందించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని లింగాల ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఏదులాపురం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన విప్ తుంబూరి దయాకర్ రెడ్డి సేవలను లింగాల ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి పొంగులేటి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు లింగాల కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
About The Author
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
