పరీక్షలను ఆనందంగా ప్రశాంతంగా రాయాలి .

ఎం ఈ ఓ

పరీక్షలను ఆనందంగా ప్రశాంతంగా రాయాలి .

విద్యార్థులు ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని కృష్ణ మండల విద్యాధికారి నిజాముద్దీన్ అన్నారు.గురువారం
మండలంలోని ముడుమాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  విద్యార్థులకు పదవ తరగతి పరీక్ష హాల్ టికెట్లను, పరీక్షలకు అవస రమైన పరీక్ష సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఎంఇఓ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా ఆనందంగా ప్రశాంతంగా పరీక్షలను రాయాలని అన్నారు సంవత్సర కాలం పాటు చదివిన అంశాలను ఎన్నో పరీక్షలు రాసి ఇప్పటికే మీరు సంసిద్ధంగా ఉన్నారని వారు అన్నారు పరీక్షలకు కనీసం అరగంట ముందుగా చేరుకొని ఒత్తిడికి లోను కాకుండా ఉండాలని అన్నారు అదేవిధంగా వేసవికాలం ప్రారంభమైనందున సాత్విక హారం తీసుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు ఈ విద్యా సంవత్సరం పరీక్షకు పరీక్షకు మధ్య కొంత విరామం ఇవ్వడం వల్ల ఆ సమయంలో పాఠశాలకు విచ్చేసి ఉపాధ్యాయుల సహకారంతో ఇంకా మంచిగా ప్రిపేర్ కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం కురుమయ్య జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ రమేష్ తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:14.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎం ఈ ఓ 
______________________

Tags:

About The Author

Latest News