పాత పద్ధతిలోనే ఫిట్నెస్ పరీక్షలు
మూడు నెలలు గడిపించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు
By Ram Reddy
On
రాష్ట్ర లారీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు బారీ
పెద్దపల్లి ఏప్రిల్ 13 :(లోకల్ గైడ్)
రవాణా వాహనాలకు తప్పనిసరి చేసిన క్యూఆర్' రిఫ్లెక్టివ్ టేపుల నిబంధనను, మూడు నెలల గడువు పెంచారని తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు వారి తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగాన్ని నమ్ముకుని వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, ఐతే ఇటీవల ప్రభుత్వం వాహనాలకు క్యూఆర్ కోడ్ కలిగిన రిఫ్లెక్టివ్ టేపులను మరియు రేర్ మార్కింగ్ ప్లేట్లను ఫిబ్రవరి 20 నుండి తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడ్డామన్నారు. ఈ నిబంధనలకు నిరసనగా అన్ని జిల్లాల్లో లారీ అసోసియేషన్ చేపట్టిన ధర్నాలు నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం దిగివచ్చి మూడు నెలలు గడువు పెంచింది అన్నారు. దీంతో మూడు నెలల పాటు గతంలో మాదిరిగానే ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ సోమిశెట్టి తిరుపతి, సభ్యులు సురేందర్, శ్రీనివాస్, వ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆరిఫ్, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
20 Apr 2026 18:23:18
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
