మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని బాలికల ప్రభుత్వ వసతి గృహంలో శుక్రవారం రాత్రి జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.విద్యార్థినిలను వెంటనే స్థానిక వంద పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బెల్లంపల్లి బస్తీలోని సమీకృత పాఠశాలలో రాత్రి విద్యార్థినిలకు మిల్ మేకర్ కూర వడ్డించారు.కూరలో పురుగులు ఉన్నాయనే విషయాన్ని విద్యార్థినులు వార్డెన్ దృష్టికి వెళ్లారు.అయినా పట్టించుకోకుండా వడ్డించారు.దీంతో అదే కూర తిన్న తర్వాత విద్యార్థినిలు వాంతులు చేసుకోగా,మరికొందరు సృహ కోల్పోయారు.చుట్టుపక్కల స్థానిక ప్రజలు గమనించి తమ కార్లు,ఇతర వాహనాల ద్వారా విద్యార్థులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు.వైధ్యులు వారికి చికిత్స అందిస్తున్నారు.ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.అదేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వార్డెన్ ను సస్పెండ్ చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.