మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని.

పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద సంతకాల సేకరణ.

మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని.

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగం గౌడ్.

 

 

 

మిర్యాలగూడ ఫిబ్రవరి 6 (లోకల్ గైడ్)

 ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకమై బీసీల ఓట్లు బీసీలే వేసుకోవాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ పిలుపునిచ్చారు.జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న దగ్గర బీసీల ఓట్లు బీసీలకే వేసుకోవాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం లింగంగౌడ్ మాట్లాడుతూ జనరల్ స్థానాలంటే కేవలం అవేవో అగ్రకులాలకు రిజర్వేషన్లు అన్నట్టు ఫీల్ అవుతున్నారని జనరల్ స్థానాలు వారికి అగ్రిమెంటు అన్నట్టు అన్ని పార్టీలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నాయని బీసీలంతా ఐక్యమై మన యొక్క ఐక్యమత్యాన్ని చాటి జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పెద్ద ఎత్తున విజయం సాధించి బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,ఎర్రబెల్లి దుర్గయ్య,గుండెబోయిన నాగేశ్వరరావు యాదవ్, బంటు కవిత,ఎస్పీ నాయుడు, చిత్రం ఉమ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ధీరావత్ లింగనాయక్,విజయలక్ష్మి, శ్రీలత,పార్వతి,లవన్ కుమార్, వెంకటేష్,సందీప్, ఉష,రేణుక, గాయత్రి,మౌనిక, ప్రభంజన్,సందీప్,వసంత రాజు,కుమారి,శిల్ప, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News