మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్
కౌంటింగ్ ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్.
ఖమ్మం :లోకల్ గైడ్
నిబంధనల ప్రకారం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ* 5 మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలో మెష్ ఏర్పాట్లతో, కౌంటింగ్ విధుల అధికారులకు, కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పటిష్ట పోలీస్ బందోబస్తుతో, అన్ని కౌంటింగ్ కేంద్రాలలో 100 శాతం వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నట్లు, ప్రతి కౌంటింగ్ కేంద్రంలో రూట్ మ్యాప్ బోర్డులు ఏర్పాట్లు చేసినట్లు అన్నారు.
కౌంటింగ్ హాల్స్ లో కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంటుందని, వీరందరికి సంబంధిత పాసులు జారీ చేసినట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో కౌంటింగ్ ప్రారంభ మవుతుందని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పూర్తి నిబంధనలు పాటించాలని అన్నారు.
కౌంటింగ్ తర్వాత రిజెక్ట్ ఐనా బ్యాలెట్ పత్రాలతో సహా మొత్తం ఎన్నికల సామాగ్రి సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలని కలెక్టర్ తెలిపారు. ఏదులా పురం లోని 31 వార్డులు, మధిరలోని 22 వార్డులకు, సత్తుపల్లి లోని 23 వార్డులకు, వైరా, కల్లూరు లోని 20 వార్డులకు రెండు రౌండ్ లలో కౌంటింగ్ పూర్తయ్యేలా టేబుల్స్ వేసి కౌంటింగ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
ఎన్నికల కౌంటింగ్ సంబంధించి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్స్ తరలించే ప్రక్రియ గురించి ముందుగానే రాజకీయ పార్టీలకు సమాచారం అందించి, మొత్తం ప్రక్రియ వీడియోగ్రఫీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కౌంటింగ్ విధుల అధికారులు విధుల్లో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావివ్వవద్దని, అప్రమత్తంగా ఉంటూ, తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. మునిసిపల్ కమిషనర్లు అప్రమత్తంగా ఉంటూ, ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని, అధికారులు, కౌంటింగ్ సిబ్బందిని గైడ్ చేస్తూ, ప్రక్రియ సజావుగా పూర్తి చేయాలని తెలిపారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లుదా. పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, మునిసిపల్ కమీషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
