ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం

బిజెపి సీనియర్ నేతలు నాగురావు నామాజీ 

ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం

నారాయణపేట ఫిబ్రవరి 12:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపాలిటీ ఎన్ని కల్లో బిజెపి అనూహ్య విజ యం సాధిస్తుందని బిజెపి  రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ స్పష్టం చేశారు.గురువారం నారా యణపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు కే.రతంగ్ పాండురెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు సత్య యాదవ్ తో కలిసి మాట్లాడు తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిజెపి వైపు నిలి చారని ప్రజల ఆశీస్సులతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనూహ్య ఫలితాలు సాధించ బోతున్నామని అన్నారు. జిల్లాలోని నారాయణ పేట,మక్తల్ అమరిచింత మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.మిగతా మున్సిపాలిటీల్లో బిజెపి గణనీయమైన సంఖ్యలో వార్డు కౌన్సిలర్ లను గెలుచు కుంటామని అన్నారు. సాక్షా త్తు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మున్సిపోల్ ఫలి తాల్లో బిజెపి సత్తా చాటు తుందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలకు విసిగిన ప్రజలు బీజేపీని ఆదరించారని దాంతో అనూ హ్య ఫలితాలు సాధించ బోతున్నామని అన్నారు. బీజేపీకి సహకరించిన ప్రజ లకు,ఎన్నికలు ప్రశాంతం గా జరిగేలా సహకరించిన అధి కారులు,పోలీస్ యంత్రాం గానికి కృతఙ్ఞతలు తెలి పారు.ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్,మాజీ ప్రధాన కార్యదర్శి రఘు రామయ్య గౌడ్,పట్టణ బిజెపి అధ్యక్షుడు పోషల్ వినోద్,మీడియా ఇంఛార్జి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగురావు
_______________________

Tags:

About The Author

Latest News

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే  నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే 
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్  కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సిపిఆర్ పై 108 సిబ్బంది అవగాహన
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత... జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ఘనంగా సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు*
మానవత్వం చాటుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి.
పేట కోర్టు ముందు 3వ రోజుకు చేరిన దీక్షలు