14న అంబేద్కర్ జయంతికి పూర్తి ఏర్పాట్లు చేయాలి 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్....

14న అంబేద్కర్ జయంతికి పూర్తి ఏర్పాట్లు చేయాలి 

 

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల దృష్ట్యా ఈనెల14న పూర్తి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల14న ఉదయం 9గంటలకు జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి,9.30 గంటలకు నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,10గంటలకు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు,ట్రాఫిక్ నియంత్రణ,జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం,విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా,మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్యం,అలంకరణ,మరమ్మత్తుల నిర్వహణ,త్రాగునీటి ఏర్పాటు,అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యుత్ దీపాలంకరణ,వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అత్యవసర సేవల నిమిత్తం వైద్య శిబిరం నిర్వహణ విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.అంబేద్కర్ జయంతి వేడుకలకు అన్ని శాఖల అధికారులు,వివిధ కుల సంఘాల ప్రతినిధులు,ప్రజలు సకాలంలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Tags:

About The Author

Latest News

బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
నారాయణపేట ఏప్రిల్ 17: కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలంగా మహిళలు ఎదురుచూస్తున్న మహిళా బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెడితే ఆబిల్లు ను క్రూరంగా కాంగ్రెస్ కూటమి...
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.
రోడ్డు భద్రత నియమాలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ. రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు ఐపీఎస్ సాధ్యం.
విద్యుత్ వినియోగదారులకు కొత్త సర్వీసుల మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి .....జిల్లా కలెక్టర్ అంకిత్
అన్నారం లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ తీరుపై ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల గర్జన!