కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం 

దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు.

కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరం 

తుర్కపల్లి ,జనవరి 29 (లోకల్ గైడ్ )

ఫోన్ టాపింగ్, సీట్ విచారణకు రావాలని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడం దురదృష్టకరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. హామీలను నెరవేర్చమని అడిగితే విచారణలు, కేసులను పెట్టి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి రాజకీయాలను మానుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, సర్పంచులు బద్దు నాయక్, చౌదర్పల్లి సర్పంచ్ వెంకటేష్ ముదిరాజ్  మాజీ ఎంపీటీసీలు గిద్దె కరుణాకర్, ఏషాబోయిన రాజయ్య యాదవ్ ,ప్రతిభ రాజేష్ నాయక్, మాజీ సర్పంచులు కల్లూరి ప్రభాకర్ రెడ్డి ,మాలోతు శ్రీను నాయక్ ,మేకల అమలా బాలకృష్ణ, నాయకులు సురేందర్, యాదగిరి ,సంతోష్ నాయక్, భాను ,భూపతి అజయ్, అనిల్ ,గణేష్, తిరుపతి, పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన           ఎన్నికల సంఘం కార్యాలయాన్ని సందర్శించి మెమోరాండం సమర్పించిన          
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)  జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము.  వారు తమ ఓటు...
12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి. 
శివరాంపల్లి పిల్లర్ నెంబర్ 274 వద్ద  ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి.                                                                
నూతన గుడి నిర్మాణానికి విరాళం
రవాణా రంగా పరిరక్షణ కార్మిక హక్కులకై జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయండి..
ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు