కార్మిక హక్కుల రక్షణ కోసం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.
కార్మిక సంఘాల నేతల పిలుపు.
By Ram Reddy
On
సుభాష్ విగ్రహం నుండి పెదగడియారం వరకు నిరసన ర్యాలీ అనంతరం సభ
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.ఫిబ్రవరి 12. లోకల్ గైడ్
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రక్షించుకోవాలంటే ఐక్య పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు అంబటి సోమయ్య బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు పిలుపునిచ్చారు.గురువారం దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె లో భాగంగా సి ఐ టీ యూ, ఎఐటియుసి, ఐ ఎన్ టి యు సి బి ఆర్ టి యు, ఐ ఎఫ్ టి యు దేశం లో అన్ని ట్రేడ్ యూనియన్స్, జాతీయ ఫెడరేషన్, ఈఒక్కరోజు రోజు సమ్మెచేయాలని పిలుపును ఇచ్చాయి అందులో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సుభాష్ విగ్రహం నుండి పెద్ద గడియారం వరకు ప్రదర్శన అనంతరం సభ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలనీ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు 100 సంవత్సరాలు పోరాడి తీసుకొచ్చిన 29 చుట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చారని అవి కార్మికులకు, రైతులకు, ప్రజలను నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, పని గంటలు 8 గంటలు కాకుండా పనిగంటలు పెంచుతూ, వేతనాలు అడిగే హక్కు లేకుండా కార్మికులకు తీవ్రంగా నష్టం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు ఉపాధి హామీ చట్టం రద్దు ద్వారా గ్రామీణ పేదల ఉక్కు పాదం మోపే విధంగా వి బి జీ రాం జీ, విద్యుత్ సవరణ , రైతులకు నష్టం కలిగించు విత్తన సవరణచట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, తక్కువ వేతనాలతో ఎక్కువ పనులు చేయించుకునే విదంగా, పని ప్రదేశాలలో ఎటువంటి హక్కులు అడగకుండా చేసి, ప్రతి ఘటన లేకుండా చేయడం,కార్మికులకు, రైతులకు, ప్రజలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు కార్మికులకు హక్కులు లేకుండా చేసే ఈ లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలి లేకుంటే రాబోయే రోజుల్లో కార్మికులను, రైతులను, ప్రజలను అందరినీ ఐక్యం చేసిపోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పున్న కైలాస నేత మాట్లాడుతూ కార్మికులు హక్కుల రక్షణ కోసం జరుగుతున్న పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూల విధానాలను అమలు చేస్తూ కార్మికులను బానిసలుగా చేస్తుందని ఆరోపించారు పోరాటాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొని మద్దతు తెలుపుతామని ప్రకటించారు.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నల్గొండ జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు ఆర్ ఆచారి దొనకొండ వెంకటేశ్వర్లు అవుట రవీందర్ బొంగురాల నరసింహ పాణ్యం వెంకట్రావు చింతకాయల సంతోష్ పరిపూర్ణాచారి పందిరి శ్యాంసుందర్ ఎన్ ఆర్ సి రాజు కందుల నరసింహ నందం మారయ్య గంజి నాగరాజు, వెంకన్న కత్తుల యాదయ్య పెరిక కృష్ణ సాగర్ల మల్లయ్య భీమనపల్లి శంకర్ బోడ ఇస్తారి గుండె రవి రేవెల్లి యాదయ్య. పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
25 Feb 2026 18:55:38
తొర్రూర్ (లోకల్ గైడ్ )తొర్రూర్ పట్టణంలోని బీఆర్ గార్డెన్ లో నిర్వహించిన తొర్రూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ కుమార్తె వివాహ మహోత్సవ వేడుకలో...
