అక్షర యోధుడు ఇక ప్రజా ప్రతినిధి 

7వ వార్డు విజేతగా కొల్లి రవికిరణ్ ప్రమాణ స్వీకారం!

అక్షర యోధుడు ఇక ప్రజా ప్రతినిధి 

​అశ్వారావుపేట, లోకల్ గైడ్ :

అశ్వారావుపేట మున్సిపాలిటీ రాజకీయ యవనికపై ఒక యువ కెరటం ఉప్పెనలా ఎగిసింది. కలంతో ప్రజా సమస్యలపై గళమెత్తిన జర్నలిస్ట్, మాజీ ఎంపీటీసీ కొల్లి రవికిరణ్, ఇప్పుడు నేరుగా ప్రజా క్షేత్రంలో విజయం సాధించి కౌన్సిలర్‌గా అడుగుపెట్టారు. హోరాహోరీగా సాగిన 7వ వార్డు ఎన్నికల పోరులో 19 ఓట్ల స్వల్ప మెజార్టీతో ప్రత్యర్థులను చిత్తు చేసి, బిఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభిమానాన్ని గెలిచి ​గతంలో సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయం చేజారినప్పటికీ, రవికిరణ్ వెనకడుగు వేయలేదు. అభివృద్ధికి ఆటంకంగా మారిన శక్తులను ఎదిరించి, సామాన్య ఓటరు అండతో కారు గుర్తుపై విజయం సాధించి తన సత్తా చాటారు.​ప్రమాణ స్వీకారం అనంతరం కొల్లి రవికిరణ్ మాట్లాడుతూ, తన గెలుపు 7వ వార్డు ప్రజల విజయమని ప్రకటించారు. వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దడం, సిసి రోడ్ల నిర్మాణం. ప్రజా సమస్యల పరిష్కారంలో 24 గంటలు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించడమే ద్వేయమని, అశ్వారావుపేట మున్సిపాలిటీలోనే 7వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ​జర్నలిస్టుగా ఎందరో సమస్యలను వెలుగులోకి తెచ్చిన రవికిరణ్, ఇప్పుడు కౌన్సిలర్‌గా బాధ్యతలు చేపట్టడంపై అశ్వారావుపేట యువత, పాత్రికేయ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే 7వ వార్డు ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడిన నాకు, ఇప్పుడు ప్రజలు అధికారమనే బాధ్యతను ఇచ్చారని, వార్డు ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, మాట ఇచ్చిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. నా విజయంలో భాగస్వామ్యమైన ఏడో వాడు ప్రజలందరికీ, బిఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు