పేట పుర పట్టపురాణి కొండా శ్వేత సత్యయాదవ్ 

వైస్ చైర్ పర్సన్ మంజుల జి ఆర్  రెడ్డి

పేట పుర పట్టపురాణి కొండా శ్వేత సత్యయాదవ్ 

IMG-20260216-WA0071నారాయణపేట ఫిబ్రవరి 16:

నారాయణపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా కొండా శ్వేత సత్యయాదవ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్ పర్సన్ గా మంజుల జి ఆర్ రెడ్డి ఎన్నికయ్యారు.
ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు సోమవారం మున్సిపాలిటీ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక  ప్రత్యేక అధికారి రామ్ చందర్ నాయక్ నిర్వహించారు.
చైర్ పర్సన్ గా ఎన్నికైన కొండా శ్వేతా సత్య యాదవ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.నారాయణ పేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ అభ్యర్థిగా బీజేపీ నుంచి కొండా శ్వేతా సత్య యాదవ్ ను  5 వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర ప్రతిపాదించగా.  1వ  వార్డు కౌన్సిలర్ సత్య రఘుపాల్ బల పరిచారు. 
కాంగ్రెస్ నుంచి 9వ వార్డు కౌన్సిలర్ మహేశ్ . 20 వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ శ్వేతను  చైర్ పర్సన్ అభ్యర్థి గా ప్రతి పాదించగ, 18 వ కౌన్సిలర్ గొల్ల రవి తేజ్ బలపర్చారు.అనంతరం జరిగిన ఓటింగ్ లో  బీజేపీ చైర్ పర్సన్ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ ను ఎంపీ డీకే అరుణ ఎక్స్ ఆఫీసీయో సభ్యురాలితో పాటు మిగతా 11 మంది బీజేపీ కౌన్సిలర్లతో పాటు పదో వార్డు స్వతంత్ర కౌన్సిలర్ తో కలిపి మొత్తం 13 మంది చేతులెత్తి ఓటు వేశారు. కాంగ్రె స్ నుంచి  ఎక్స్ ఆఫీసీయో సభ్యురాలు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, మిగతా కాంగ్రెస్ కౌన్సిలరు 7 మంది, ఇద్దరు ఎం.ఐ.ఎం. ఒక ఏ.ఐ.ఎఫ్.బి. కౌన్సిలర్ తో కలిపి మొత్తం 11 మంది చేతులెత్తి ఓటు వేశారు.దాంతో ఎన్నికల ప్రత్యేక అధికారి రామ్ చందర్ నాయక్  13 మంది ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండా శ్వేతా సత్య యాదవ్ ను చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.అనంతరం నిర్వహించిన వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి 11వ వార్డు కౌన్సిలర్ భాగ్య వతినిని 9 వ వార్డు కౌన్సిలర్ మహేష్ ప్రతిపాదించగా18 వ వార్డు కౌన్సిలర్ రవితేజ బల పరిచారు.అలాగే బిజెపి నుంచి వైస్ చైర్మన్ కోసం బిజెపి నుంచి 6 వవార్డు కౌన్సిలర్ ను 1వ వార్డు కౌన్సిలర్ సత్య రఘుపాల్ ప్రతిపాదించగా 5వ వార్డు కౌన్సిలర్ రాఘవేంద్ర బలపరిచారు.ఓటింగ్ నిర్వహించగ మజ్లిస్ తటస్థంగా ఉండడంతో  బాగ్యవతికి 8 ఓట్లు రాగా బిజెపి 6 వవార్డు కౌన్సిలర్ మంజులకు ఎంపీ ఓటు తో  కలిపి 13 ఓట్లు వచ్చాయి.దాంతోమంజుల ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి రామ్ చందర్ నాయక్ ప్రకటించారు.
ఫోటో రైట్ అప్:1.నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కొండా శ్వేత,2. వైస్ చైర్మన్ మంజుల
______________________

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు