గిరిజన గ్రామాల్లో మానవతా సేవలు చేపట్టిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

ఆదివాసీ గ్రామాల్లో 250 కుటుంబాలకు రూ 5 లక్షల విలువ గల రగ్గలు, టార్పాలిన్, దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, జిల్లా కోఆర్డినేటర్ 

గిరిజన గ్రామాల్లో మానవతా సేవలు చేపట్టిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ

భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
చర్ల మండలంలోని మారుమూల ఆదివాసి గ్రామాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఆధ్వర్యంలో రగ్గులు టార్పిలిన్, దుస్తులు ఆదివారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మారుమూల గిరిజన ప్రాంత సంక్షేమం కొసం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ద్వారా రగ్గులు, టార్పాలిన్, డ్రస్ లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, భద్రాచలం శాఖ చర్ల మండలం లోని మారుమూల గిరిజన గ్రామలైన చెన్నాపురం, యర్రం పాడు, గోరుకొండ, రాళ్లగడ్డలలో 250 కుటుంబాలకు రూ 5 లక్షల విలువ గల రగ్గలు, టార్పాలిన్, డ్రస్ లు మొదలైన దుస్తులను పంపిణీ చేసినలు డాక్టర్ ఎస్ ఎల్ కాంతారావు, జిల్లా కోఆర్డినేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్  జితిస్ వి పాటిల్, ఏ ఎస్ పీ భద్రాచలం విక్రమ్ కుమార్ సింగ్, కార్యదర్శి  శ్రీరాములు, అభయ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఫౌండేషన్  సమాకూర్చినారని వారికి ఎస్ఎల్ కాంతారావు  ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో  సూర్య నారాయణ, జీ రాజ రెడ్డి, డాక్టర్ వేముల, కామేశ్వరరావు, సీఐ అఫ్ పోలీస్, చర్ల సీఐ రాజవర్మ, ఎస్ఐ అఫ్ పోలీస్ నర్సిరెడ్డి, సర్పంచ్ మడకం నంద, ముసికి, సోమయ్య, ఎట్టి, చిన్ని, ముసికి, రాజయ్య, వి వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, మారుతీ నర్సింగ్ విద్యార్ధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి