సుబ్బారెడ్డి గూడెంలో గోపాలమిత్ర పశు వైద్య శిబిరం నిర్వహణ.
గొర్రెలకు మరియు మేకలకు షీ ఫాక్స్ టీకాలు వేయడం జరిగింది.
(లోకల్ గైడ్, తెలంగాణ )
పశుగణాభివృద్ధి సంస్థ ,పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామం లో గోపాలమిత్ర పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో48 గేదెలకు పలు రకాల వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన వైద్యాన్ని అందించినారు 33 దూడలకు నట్టల నివారణ మందులను తాగించినారు గొర్రెలకు మరియు మేకలకు షీ ఫాక్స్ టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందుల సైదులు, ఉప సర్పంచ్ జెట్టి చంద్రయ్య నల్గొండ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జూలకంటి వెంకట రెడ్డి, మిర్యాలగూడ
మండల పశువైద్యాధికారి
డాక్టర్ ఎన్ దుర్గా రమాదేవి, తుంగపాడు మండల పశు వైద్యాధికారి జ్ఞానేశ్వర్ ప్రసాద్,
వి ఎల్ ఓ వెంకటేశ్వర్లు, రిటైర్డ్
ఎల్ ఎస్ ఏ నాగరాజు, వి ఏ సుభానా గోపాలమిత్ర సూపర్వైజర్ శివారెడ్డి, ఓస్ కాంతమ్మ. వాల్యా
గోపాల మిత్రులు. వెంకట్ రెడ్డి. ప్రభాకర్. డి. శ్రీను,సందీప్, హరికృష్ణ, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
