బాన్సువాడలో నామినేషన్స్వీకరణ కేంద్రాల పరిశీలన జిల్లా ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శన.
ఎన్నికల విధుల పట్ల పూర్తి జాగ్రత్తతో వ్యవహరించాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్
By Ram Reddy
On
లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి
అభ్యర్థులు అన్ని వివరాలతో నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేసేలా హెల్ప్ డెస్క్ ద్వారా అవగాహన కల్పించాలని, వారి సందేహాలను నివృత్తి చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుబడి పాటిస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, క్షేత్రస్థాయిలో ఎన్నికల సిబ్బంది పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ నెల 30వ తేదీ వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయదలచిన అభ్యర్థులు సంబంధిత మున్సిపాలిటీ పరిధిలోని ఏదైనా డివిజన్/వార్డులో ఓటరుగా నమోదై ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రతిపాదకులు (ప్రపోజర్స్) మాత్రం అదే డివిజన్/వార్డుకు చెందిన ఓటరై ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచామని, నామినేషన్ పత్రాల పరిశీలన కోసం అవసరమైన సిబ్బందిని నియమించామని తెలిపారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పక్కాగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడతాయని, ఎవరూ కూడా ఎలాంటి అపోహలు లేదా సందేహాలకు గురికావద్దని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి జిల్లా గారిచే జారీ చేయనైనది.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Feb 2026 20:09:04
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 10 (లోకల్ గైడ్ ప్రతినిధి)
జిల్లాల నుండి పనిచేసే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న అనేక మంది ఓటర్లను మేము గమనించాము. వారు తమ ఓటు...
