షెడ్యూల్ కులాల సంక్షేమ నిధులు యువత ఉపాధి కోసం వినియోగించాలి
ఎమ్ ఆర్ పీ ఎస్ సీనియర్ నాయకులు కూరపాటి వీర్రాజు
భద్రాద్రి జిల్లా, చర్ల : లోకల్ గైడ్ :
షెడ్యూల్ కులాల ఆర్థిక ప్రగతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా 2025 - 26 సంవత్సరానికిగాను సుమారు రూ 40, 232 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా నేటి వరకు ఎస్ సీ యువతకు ప్రయోజనం లేకుండా పోయిందని, మార్చి నెలతో ఆ నిధులు ఖర్చు చేయకుండానే మిగిలిపోతున్నాయని, ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవ తీసుకొని షెడ్యూలు కులాల సంక్షేమం నిధులను రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల యువతకు ఉపాధి మార్గం చూపేలా నిధులను ఖర్చు చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల సంక్షేమం కొరకు పాటుపడాలని సీనియర్ రాజకీయ విశ్లేషకులు కూరపాటి వీర్రాజు మాదిగ అన్నారు. చర్ల మండలంలో సుమారు 3,000 వేల దళిత కుటుంబాలు ఉండగా నేటి వరకు దయనీయ పరిస్థితిలో జీవనం సాగిస్తున్నారు. 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో నేటికీ సరైన ఇల్లు లేకపోవడం కూడు కోసం గూడు కోసం ఉపాధి కోసం నిరంతరం పడరాని పాట్లు పడుతున్నారు ఇకనైనా సీఎం రేవంత్ ప్రత్యేకత తీసుకొని, చర్ల మండలంలోని షెడ్యూల్ కులాల కుటుంబాలకు ఎకరం భూమి, ఇందిరమ్మ ఇండ్లు అంబేద్కర్ అభయహస్తం రూ 12 లక్షలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించి, భద్రాచలం నియోజకవర్గంలోని మారుమూల చర్ల మండలంలోని షెడ్యూల్ కులాల కుటుంబాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
