చేనేత అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం.

సిద్ధిపేట జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ తెలంగాణ)

మార్చి 04: సంత్ కబీర్ / జాతీయ చేనేత అవార్డ్స్–2026 కోసం చేనేత కళాకారులు మరియు డిజైనర్ల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత జౌళి శాఖ అధికారులు తెలిపారు. ఆసక్తి గల అర్హులైన చేనేత నిపుణులు ఈ నెల 23వ తేదీ వరకు సిద్ధిపేటలోని చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు వారు స్వయంగా మగ్గంపై తయారు చేసిన పూర్తి వస్త్రాన్ని నమూనాగా సమర్పించాలని తెలిపారు. ఇతరుల నుండి కొనుగోలు చేసిన వస్త్రాలు స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News