మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో కుటుంబ సమేతముగా అమ్మవార్లను దర్శించుకున్న జంగా

తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్  జంగా రాఘవరెడ్డి... వెల్లడి

మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో కుటుంబ సమేతముగా అమ్మవార్లను దర్శించుకున్న జంగా

హనుమకొండ జిల్లా ప్రతినిధి  లోకల్ గైడ్ 

తెలంగాణ కుంభమేళా,భక్తికి ప్రతీక అయిన మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరలో కుటుంబ సమేతముగా అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది అన్నారు. 
అశేష భక్తజనవాహిని నడుమ,ఆ తల్లుల గద్దెల వద్ద మొక్కులు చెల్లించి,రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు,
సుఖసంతోషాలు కలగాలని మనసారా వేడుకున్నారు. 
ఆదివాసీ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన మేడారం జాతర విశిష్టతను ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి కొనియాడారు.
సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News