మాట తప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు _ నాగురావు నామాజీ 

16 వార్డు బిజెపి అభ్యర్థి  అంబికా శ్రీనివాస్ తరపున ఆయన ఇంటింటి ప్రచారం

మాట తప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు _ నాగురావు నామాజీ 

నారాయణపేట జనవరి 31:

హామీలు ఎగ్గొట్టి మాట తప్పిన కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు అని బిజెపి రాష్ట్ర సీనియర్ నేత నాగురావు నామాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.శనివారం నారాయణపేట మున్సిపాలిటీలోనీ 16 వార్డు బిజెపి అభ్యర్థి  అంబికా శ్రీనివాస్ తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందాలని కాంగ్రెస్ నాయకులు మితిమీ రిన హామీలు ఇస్తున్నారని వారి మాయ మాటలు నమ్మొద్దని కోరారు.గత ఎన్నికల్లో 17 వ వార్డులో గెలిచి  మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్  అయిన వారు ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ఏమి చేయక ఆ వార్డు ప్రజలకు మొఖం చూపలేక ఈ సారి ఎన్నికల్లో వార్డు మారి చైర్మన్ అవుతానని పూటకో పార్టీ మారి 16 వార్డుకు వచ్చారని అన్నారు.కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావచ్చిన మున్సిపాలిటీల అభివృద్ధికి నయా పైసా నిధులు కేటాయించలేదని విమర్శించారు.కానీ ఎన్నికలు రావడంతోమంత్రులు,ఎమ్మెల్యేలు ,నాయకులు వందల కోట్ల నిధులతో పట్టణాల అభివృద్ధి చేస్తామని జూటా మాటలు మాట్లాడు తున్నా రని అన్నారు.చిత్త శుద్ది ఉంటే ఈ రెండున్నర ఏళ్లలో నారా యణపేట పట్టణంలో చెందిన ఒక్క అభివృద్ది పని చూపిం చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రగతి ఏమిటంటే పట్టణం లోని 65 వేల మందికి జిల్లా ఆస్పత్రిని 12 కిలో మీటర్ల దూరం తరలించి వైద్యం దూరం చేయడమేనని ద్వజ మెత్తారు.పట్టణంలో జరిగిన అభివృద్ది కేవలం కేంద్రం నిధులతోనేనని అన్నా రు.ప్రజలను పట్టించుకొని పూటకో పార్టీ మారే వ్యక్తులకు బుద్ధి చెప్పాలని కోరారు.మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మరింత అభివృద్ది కి ఆస్కారం ఉంటుందని బిజెపి అభ్యర్థి అంబికా శ్రీనివాస్ నీ ఆదరించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:1.ప్రచారం చేస్తున్న నాగురావు నామాజీ 
_______________________

Tags:

About The Author

Latest News